సోమానందం

సోమానందం — Somanandam Souvenir
షష్టిపూర్తి సంచిక · Retirement Souvenir · 2005
సోమానందం
Somanandam
శ్రీ అడబాల సోమానందరావు గారి షష్టిపూర్తి సంచిక
సంపాదకులు: శ్రీ ఆచార్య ఫణీంద్ర Editor: Sri Acharya Phaneendra తేదీ: 30 సెప్టెంబరు 2005
📍 Nuclear Fuel Complex, Hyderabad
📅 35 Years of Service
🌍 USA · Europe Travel Memoir

“బహుముఖీన వ్యక్తిత్వం”

A Multi-Faceted Personality
శ్రీ అడబాల సోమానందరావు
Sri Adabala Somananda Rao
Foreman (C) · NFC Hyderabad
Quick Facts
🏡 Native: Seetharampuram, Narasapuram, W. Godavari
🏢 Joined NFC: 30 September 1970
🎖 Retired: 30 September 2005
📚 Education: B.A., Ambedkar Open University
🤝 Union: NFCEA General Secretary (1979–84)
🏘 Community: Kamala Nagar Welfare Assoc. President
— రచన: శ్రీ ఆచార్య ఫణీంద్ర

పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలం ఒకప్పుడు ప్రపంచ వాణిజ్య రంగంలో ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి ఉండేది. అక్కడ వ్యాండ్డీక్రాఫ్ట్ మరియు లేస్ గూడ్లు ఉత్పత్తి చేసి, విదేశాలకు ఎగుమతి చేసిన ప్రముఖ వ్యాపారవేత్తలలో కీ.శే. అడబాల కనకాచలం గారు ఒకరు.

కనకాచలం గారు – శ్రీమతి సీతాయమ్మ దంపతుల ఏకైక పుత్రుడు శ్రీ సోమానందరావు గారు నరసాపురంలోని ప్రతిష్ఠాత్మకమైన “టైలరు హైస్కూలు” లో విద్యాభ్యాసం సాగించారు.

అణు ఇంధన సంస్థ (ఎన్.ఎఫ్.సి.) లో ఉద్యోగం సాధించుకున్న సోమానందరావు గారిలో అతి కాలంలోనే నాయకత్వ లక్షణాలు పాడచూపాయి. ఎన్.ఎఫ్.సి. ఎంప్లాయీస్ అసోసియేషన్‌లో తరువాత ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి.)లో సభ్యులై, ఎన్.ఎఫ్.సి.లో తిరుగులేని నాయకులుగా ఎదిగారు.

Life Journey · జీవన ప్రయాణం
1926
తండ్రి అడబాల కనకాచలం గారు జన్మించారు — ప్రముఖ వ్యాపారవేత్త, లేస్ ఎగుమతిదారు
1955
కనకాచలం గారి వ్యాపారానికి ఆటంకాలు — సోమానందరావు కాకినాడలో ఐ.టి.ఐ. చేరారు
1969
13 నవంబరు 1969 — గంధం సీతారావమ్మతో వివాహం, నరసాపురంలో జరిగింది
1970
Joined Nuclear Fuel Complex (NFC), Hyderabad on 30 September 1970
1972–84
Active in NFC Employees Association; elected General Secretary (1979). Elected Staff Secretary, DAE Departmental Council (1984)
1982
కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపనలో ప్రధాన పాత్ర — నేటికీ సక్రియంగా
1996
Promoted to Foreman (B), later to Foreman (C) in 2000
1998–2004
అమెరికా, యూరోప్ దేశాల పర్యటనలు — పిల్లలు, మనవళ్ళతో
2005
Retired on 30 September 2005 after 35 years of dedicated service · షష్టిపూర్తి వేడుక

శుభకామన

Tribute Poem on Retirement
రచన: శ్రీ ఆచార్య ఫణీంద్ర  |  సమర్పణ: ఎం.ఎఫ్.పి. మిత్రబృందం, ఎస్.ఎఫ్.సి., హైదరాబాద్  |  తేది: 30-09-2005
తే॥ గీ॥
మదిని దోచు ‘గోదావరీ మండలము’ న
సిరుల గురియు ‘సీతారాముపురము’ నందు
ప్రణుతి తెక్కిన ‘అడబాల’ వంశమణిగ
కలిగె – ‘సీతాయమ్మ’, ‘కనకాచలము’ కతడు !
తే॥ గీ॥
చరితకెక్కినట్టి ‘నరసాపురము’ నందు
ఆంధ్ర వీరుడా ‘అల్లూరి’ అధ్యయనము
సలిపినట్టి ‘టైలరు పాఠశాల’ చదివి,
రాటుదేలె ‘సోమానంద రావు’ ఘనుడు !
కం॥
విద్యుత్తాంకేతిక ఘన
విద్యార్జన మొనరచి, ‘అణువింధన సంస్థ’న్
హ్యాద్యముగా సలిపె నతడు –
సద్యోత్సాహమున విధుల, శ్రామిక వరుడై !
ఆ॥ వె॥
కలసి మెలసి తిరిగి, కార్మిక వర్గాల
నాయకునిగ ఎదిగి, న్యాయమైన
కోరికలను తీర్చ – పోరాటముల సల్పి,
విజయమందినట్టి వీరుడతడు !
చం॥
విమల మనసుక్కు సుతుల బెంచి, ప్రయోజకులట్లు దిద్ద – వా
‘రమేరికకె’గి, శాస్త్రవిద్యులై, నిలబెట్టగ ఆంధ్రకీర్తిన్ –
సమతుల తృప్తితో, పదవి చాలగ, వీడెడి – ‘షష్టిపూర్తి’ యా
సమయమునందు – నాతనికి శాంతి శుభామృత సాక్షిమబ్బుతన్ !

శుభాభినందనలు

Messages from Colleagues, Leaders & Organisations
NK
Dr. N. Kondal Rao
Chief Executive, NFC (Retd.)
Nuclear Fuel Complex, Hyderabad
24-09-2005
FORE WORD I am very happy to know that a souvenir is being brought out on the occasion of the retirement of Sri A. Somananda Rao from Government Service. I happened to know Sri Somanada Rao over long years as a young Labour Leader in his early age. He was remarkable as General Secretary of the Employees Union comprising of above four thousand people, with a very agreeable temperament to both the management and the Union Members. He had an illustrious career professionally and also brought up his three children with very good education to be in responsible positions in USA, today.

His approach has been very useful in most critical stages of relations and his amicable temperament used to resolve many issues without confrontations. He looks to me still young and active and I wish him a long happy healthy and prosperous life.
— N. Kondala Rao
PB
P.K. Banerjee
Dy. General Manager, Natural Uranium (P)
Nuclear Fuel Complex, Hyderabad
09/20/05
Shri A. Somananda Rao will be attaining the age of superannuation on 30th September, 2005 after dedicated service of 35 years at NFC, most of which has been spent for maintenance and development activities of fuel group. Due to his dedicated service, knowledge in the subject and leadership qualities, he has been promoted to the grade of Foreman in the year 1996.

Apart from technical jobs, he has worked for welfare of workmen and while doing so, he has always remembered the main philosophy of the department. Some of his technical contributions have improved the availability and productivity for few critical equipments. I know Shri Rao personally for last 20 years. His contributions for fuel group will be always remembered.
— P.K. Banerjee
PN
P. Nageswara Rao
National Secretary
AITUC, New Delhi
12-09-2005
I am associated with Com Somanada Rao in the years 1981–84 when I was the President of NFC Employees association (NFCEA). NFCEA was formed in November 1972. Com. Rao joined the association and was elected as treasurer in 1973–74. It was in 1979 that Com. Rao was elected as General Secretary of the NFCEA and continued up to 1984. In 1984, Com. Rao was elected as staff secretary in the Department of Atomic Energy, representing about 40,000 employees.

Com. Rao was promoted as supervisor in 1996 and since then he was out of the union activities but his service to the employees of NFC through NFCEA is unforgettable. I wish that Com. Rao should live with full good health & prosperity along with his family during his retired life.
— P. Nageswara Rao, National Secretary, AITUC
TN
T. Narasimhan
National Vice-Chairman
Confederation of Central Government Employees & Workers
12-09-2005
On the occasion of the retirement from service on 30-09-2005 after completion of 35 years of successful service in NFC, I, on behalf of Confederation of Central Government Employees and Workers, New Delhi and A.P. State Council, wish Com. A. Somananda Rao a happy and peaceful retired life.

Com. Somananda Rao, since his entry into the department, was active in union, worked in various positions, with devotion and dedication towards the interests of the workers in NFC. He was elected as General Secretary of NFC employees union in 1979 and continued upto 1984. I wish and hope, Com. A. Somananda Rao, with his rich experience in the Trade Union Movement, will continue to serve the working class in the future also.
— T. Narasimhan, National Vice-Chairman
MI
Md. Iqbal Khan
President, NUFCOSSA
Nuclear Fuel Complex Supervisory Staff Association
Message from NUFCOSSA Shri A. Somananda Rao, Foreman (C) is retiring on superannuation on 30th September 2005, after rendering 35 years of dedicated service in NFC. Shri Somananda Rao has shown keen interest in the welfare of fellow employees. He was associated with NFC Employees Association (NFCEA) right from its inception in the year 1973 and was subsequently elected as Treasurer in the year 1974. He served as General Secretary of NFCEA for a long period i.e., from 1979 to 1984.

The activities of Shri Somananda Rao were not confined within the four walls of NFC. He was elected as Secretary, Staff side of Departmental council, DAE during the year 1984, representing then around 40,000 and odd DAE employees. On behalf of all NUFCOSSA members I wish him a very happy, healthy and long retired life.
— Md. Iqbal Khan, President, NUFCOSSA
వి
వి. ఎస్. బోస్
రాష్ట్రకార్యదర్శి, ఎ.ఐ.టి.యు.సి.
కామ్రేడ్ సోమానందరావు అనగానే ఎన్.ఎఫ్.సి., అందులోని ట్రేడ్ యూనియన్ ఉద్యమం గుర్తుకు వస్తాయి. కార్మిక సమస్యల యోదలా తనదైన శైలిలో స్తంభించేవారు. 1979లో కామ్రేడ్ సోమానందరావు గారి నాయకత్వంలో (జనరల్ సెక్రటరీ) ఎన్.ఎఫ్.సి. కార్మికులకు రెండవ శనివారం సెలవుదినంగా సాధించడం ఆయన ఘనత.

తేది: 30-09-2005 నాడు ఎన్.ఎఫ్.సి. సంస్థలో ప్రభుత్వ ఉద్యోగము నుండి పదవీ విరమణ చేస్తున్న కామ్రేడ్ సోమానందరావు ఆరోగ్యంగా ఆనందంగా మళ్ళీ ఉద్యమాలలో పాల్గొనాలని ఆశిస్తున్నాను.
— వి. ఎస్. బోస్, రాష్ట్రకార్యదర్శి
జి
జి. భిక్షపతి
జనరల్ సెక్రటరీ
కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్
కమలానగర్‌లో 1982లో సోమానందరావు గారి ఆధ్వర్యంలో కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడము జరిగినది. తరువాత 1985లో కొంతమంది సభ్యులతో కలిసి రిజిస్ట్రేషన్ చేయడము జరిగినది.

సోమానందరావు గారి ఆధ్వర్యంలో కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భముగా జాతీయ సమైక్యతా భావమును పెంపొందించు విధంగా కార్యక్రమాలు నిర్వహించాము. శ్రీ సోమానందరావు గారు ఎన్.ఎఫ్.సి.లో 35 సంవత్సరాల విజయవంతమైన సర్వీసును పూర్తిచేసికొని, పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో మా కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున హార్దిక శుభాభినందనలు.
— ఎ.వి.ఆర్. దత్తు, మనిపాల్ రెడ్డి, జి. భిక్షపతి
ఎ.ఐ.టి.యు.సి. – ఎన్.ఎఫ్.సి. యూనిట్
అభినందనలు
కామ్రేడ్ ఎ. సోమానందరావు గారు 30 సెప్టెంబరు 1970 నాడు అణుఇంధన సంస్థ (ఎన్.ఎఫ్.సి.)లో చేరారు. నవంబరు 1972లో ఆయన ఎన్.ఎఫ్.సి. ఎంప్లాయీస్ అసోసియేషన్‌లో సభ్యత్వం సీకరించి, వివిధ పదవులను అలంకరించి, ఎన్.ఎఫ్.సి. ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేశారు. 1973లో ఎగ్జిక్యుటివ్ మెంబరుగా, 1974లో ట్రెజరరుగా, 1979 నుండి 1984 వరకు జనరల్ సెక్రటరిగా, మళ్ళీ 1991, 1992 సంవత్సరాలలో వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన నిస్వార్థంగా సహకార్మికుల సమస్యలను పరిష్మరించేందుకు పాటుపడ్డారు.
— పి. ప్రభుదాస్ మరియు ఎ.ఐ.టి.యు.సి. యూనిట్ సభ్యులు

అలుపెరగని కార్మిక నాయకులు

Key Achievements as a Labour Leader
Union Victories · కార్మిక విజయాలు
  • రెండవ శనివారం సెలవు దినంగా సాధించడం (Second Saturday holiday for workers)
  • హెల్పర్ కేడర్ నుండి ట్రేడ్స్‌మన్ కేడర్‌లోకి ప్రమోషన్ చానల్ ఏర్పరచడం
  • ట్రేడ్స్‌మన్ కేడర్ నుండి సైంటిఫిక్ అసిస్టెంట్ కేడర్‌లోకి ప్రమోషన్ చానల్
  • ట్రేడ్స్‌మన్ కేడర్ నుండి చార్జ్‌హ్యాండ్, ఫోర్‌మన్ కేడర్‌లోకి ప్రమోషన్ చానల్
  • DAE Departmental Council representation for 40,000 employees (1984)
Community Service · సేవా కార్యక్రమాలు
  • కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపన (1982) — అధ్యక్షుడు
  • పార్కుల అభివృద్ధి, తాగునీటి వసతి, రోడ్లు వేయించడం
  • గణతంత్ర దినోత్సవ, స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం
  • కమలానగర్ స్కూలి స్థాపన — ఇతోధిక సేవ
  • స్వంతంగా నాటకరంగ కళాకారుడు — ‘భజంత్రీలు’, “ఉలిపి కట్టె” నాటకాలలో నటించారు
15 September 2005
Kamala Nagar Welfare Association
Regd. No. 861/85 · Kamala Nagar, Kapra, R.R. Dist., Hyd. – 62

తిరిగి 2004 లో ఎలక్షన్ పెట్టి కొత్త బాడీని ఏర్పాటు చేసి విస్తరించిన కమలానగర్ జనాభాను అనుసరించి కొంతమంది మెంబర్లను పెంచి అసోసియేషన్ను శక్తివంతం చేసి నూతనోత్సాహంతో వార్కులో ఒక ఆఫీస్ రూమును నిర్మించేశారు. ఇది అంతా శ్రీ సోమానంద రావు గారి ఇనస్పెల్ నిర్దర్శన క్రిషి ఫలితమని మా సభ్యులమంతా భావిస్తున్నాము.
ఎ.వి.ఆర్. దత్తు · మనిపాల్ రెడ్డి · జి. భిక్షపతి

నాయకత్వ మార్గంలో శ్రీ సోమానందరావు గారు

Sri Somananda Rao in Leadership

విదేశాలలో శ్రీ అడబాల సోమానందరావు దంపతులు

శ్రీ అడబాల కనకాచలం గారు స్థాపించిన “ఎ. సీతాయమ్మ & కంపెనీ”

Historic International Business Correspondence (1949–1986)
విదేశీ కంపెనీలతో చేసిన వాణిజ్యపరమైన లావాదేవీలు
STEN RAGE, Sweden
Manufacturers Representative · Export-Import
27 March 1949

Correspondence regarding agency for Sweden, confirming receipt of favour and offering to represent A. Seethayamma & Co., Seetharampuram in the Danish market — a commission of 15% was proposed.
“స్వీడన్” దేశంతో…
Glitre A/S, Norway
Sandnes, Norway
2 March 1957

Order for white and other items of handmade cotton lace goods for the Norwegian market — requesting immediate shipment of specific dimensions.
“నార్వే” దేశంతో…
SOFI Trading House, Belgium
Manufacturers/Exporter of Lace-bordered Handkerchiefs
15 February 1986

Requesting quotation for crochet laces, table-spreads, bed-spreads, oval, oblong items manufactured by A. Seethayamma & Co., Hyderabad — for supply to Belgian buyers.
“బెల్జియం” దేశంతో…
DOSHI AGENCIES, Canada
Manufacturer’s Representatives and Importers · Markham, Ontario
December 16, 1986

Receipt of letter No. HA 000060 acknowledged. Promised to contact buyers upon receipt of samples and advise the outcome. Wished A Very Happy and Prosperous New Year.
“కెనడా” దేశంతో…

నా పర్యాటక అనుభవాలు

My Travel Experiences
రచన: శ్రీ అడబాల సోమానంద రావు

విదేశీసంస్థలతో వ్యాపారం నిర్వహించిన మా నాన్నగారు శ్రీ అడబాల కనకాచలం గారు నన్ను విదేశాలకు పంపించి ఉన్నత విద్యను అందజేసి, గొప్పవానిగా తీర్చిదిద్దాలని కలలు కనేవారు. అయితే అనుకోని కారణాల వలన ఆయన వ్యాపారం 1955వ సం॥లో దెబ్బతినడంతో ఆయన కలలు, కలలుగానే మిగిలిపోయాయి.

మా అబ్బాయిల సహ్యదయత వలన, నేను నా శ్రీమతి అడబాల రత్నకుమారి పలుమార్లు అమెరికా, యూరోప్ దేశాలను సందర్చిన అవకాశం చిక్కింది. అలాగే మా నాన్నగారి కోరిక కూడా తీరినట్లయినది.

విదేశీపర్యటనలు – నా అనుభవాలు:

1998లో మొదటిసారిగా నేను నా శ్రీమతి అమెరికాకు పర్యటించడం జరిగింది. సుమారు మూడు నెలలపాటు మా అబ్బాయిలతో సరదాగా, ఆనందంగా గడిపినాము. అమెరికాలో భారతీయ పండుగలైన హోళి, ఉగాది ఎంతో వైభవంగా జరుపుకోవడం చాలా ఆనందాన్ని కళ్ళించింది. ముఖ్యంగా అక్కడి తెలుగువారు ఉగాది పండుగ జరుపుకునే తీరు నిజంగా ప్రశంసనీయం.

మా పెద్ద అబ్బాయి చి॥ శ్రీనివాసరావు వివాహం చి॥అ॥శా॥ కుసుమ తో జరిగాక – మళ్ళీ 1999లో మా దంపతులిరువురు మా అబ్బాయి కొలక్షపై అమెరికాకు వెళ్ళాము. ఆ సందర్భంలో మరికొన్ని కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం కళ్ళింది.

Places Visited · సందర్శించిన ప్రదేశాలు
🗽 Sears Tower, Chicago
🌉 St. Louis Arch
🎲 Las Vegas
🏔 Niagara Falls
🎠 Disneyland, LA
🎬 Hollywood Universal Studios
🌊 Wisconsin Dells
⛰ Pikes Peak, Colorado
🌁 Garden of the Gods
🏛 Royal Gorge, Colorado
⛪ Navipiyur (Navy Pier)
🗼 Eiffel Tower, Paris
🌷 Mini Europe, Belgium
🌷 Netherlands (Tulip Fields)
🕌 Swami Narayana Temple, Chicago
🏛 Pitts Burg Venkateswara Temple
🏔 Sandia Peak, New Mexico
Domestic Travel · దేశీయ పర్యటన
🏛 Taj Mahal, Agra
🏰 Red Fort, Delhi
🙏 Haridwar, Rishikesh
🕌 Mathura, Vrindavan
⛪ Mysore, Ooty, Coorg
🏛 Belur, Halebidu
🙏 Kanyakumari
🏛 Rameswaram, Suchindram
🔱 Tirupati, Nagarjuna Sagar
🏛 Golkonda, Warangal

దేశీయ పర్యటన – తీపి అనుభవాలు

ప్రపంచ విస్తీర్ణంతో మన భారతదేశ విస్తీర్ణం పోల్చుకొంటే ఏడవస్థానము కలిగియున్నది. అటు ఉత్తరాది నుండి దక్షిణాది వరకు, ఇటు తూర్పు నుండి పడమర వరకు సహజ వనరులు, ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేసే అతి అద్భుతమైన శిల్పనైపుణ్యం గల గుడులు, గోపురాలు మరియు గంగా, యమునా, సరస్వతి, కావేరి, గోదావరి మొ॥ అనేక నదులు ప్రవహించచూ పాడిపంటలు, పండ్ల తోటలు సాగు చేయుటకు సారవంతమైన భూమి కలిగిన దేశము.

“జననీ జన్మభూమిశ్చ – స్వర్గాదపి గరీయసీ” — మాతృభూమి స్వర్గం కంటే గొప్పది. భవ్యమైన, దివ్యమైన, భారతీయ సంస్కృతిలో నేను ఒక జిందువై మేమకమైనందుకు గర్వపడుతూ ప్రపంచపటంలో భారతదేశానికి సముస్థిత స్థానం కలగాలని ఆశిస్తున్నాను.

ఆదర్శ దంపతులు

Ideal Family — An Exemplary Life
కుటుంబ సభ్యులు · Family Members
👩 శ్రీమతి – అడబాల రత్నకుమారి
👦 కుమారులు – శ్రీనివాసరావు, ఫణికుమార్
👨‍👩‍👦 అల్లుడు – గంధం వెంకటస్వామి
👧 కుమారె – గంధం దుర్గాదేవి
💐 కోడళ్ళు – కుసుమ, కళ్యాణి పుష్పలత
👶 మనుమలు – చి॥ నాగేశ్వరరావు, చి॥ ప్రణవ్
👶 మనుమరాలు – చి॥ యశస్విని

అనుభవాల గని, నాయకత్వ మణి, మా అందరికీ ఆదర్శప్రాయమైన జీవనమార్గాన్ని స్వారిన్ ఇచ్చిన శ్రీ అడబాల సోమానందరావు గారు మా కుటుంబ పెద్ద – మా ఆదర్శకుటుంబ నిర్మాత.

ఉద్యోగ నిర్వహణలో కష్టపడి పనిచేసిన సంస్థ అభివృద్ధికి పాటు పడే మనస్తత్వం, సంస్థలో పని చేసే తోటి ఉద్యోగుల సంక్షేమం కోసం పోరాడే దృఢత్వం మాకు నిత్యం అనుసరణీయం.

35 సంవత్సరాల ఫలప్రదమైన, విజయవంతమైన ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేసికొని పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో మా కుటుంబం తరపున హ్యాదయ పూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాము.

చికాగోలో పెద్బబ్బాయి ఇంటిలో కుమారులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవళ్ళతో శ్రీ సోమానందరావు దంపతులు
📷
“చికాగో”లో స్వామినారాయణ దేవాలయంలో…
“చికాగో”లో స్వామినారాయణ దేవాలయంలో….
📷
2005లో షష్టిపూర్తి వేళ…
2005లో షష్టిపూర్తి వేళ….
సోమానందం
Somanandam · Shashti Poorti Souvenir · 2005
శ్రీ అడబాల సోమానందరావు షష్టిపూర్తి ఆహ్వాన సంఘం
1-7-168, కమలానగర్, ఇ.సి.ఐ.యల్. పోస్ట్,
హైదరాబాద్ – 500 062.
Edited by Sri Acharya Phaneendra  ·  Published 30 September 2005
Digitised online edition — All content © original publishers