భగవద్గీత

భగవద్గీత అనేది మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. ఈ గ్రంథం భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు అనే ముఖ్య విషయాలను బోధిస్తుంది.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు చేసిన ఉపదేశం ఈ గ్రంథంలో ప్రధానంగా ఉంది – అర్జునుడు తన బంధువులతో పోరాడటానికి నిరాకరించినప్పుడు, కృష్ణుడు అతనికి ఉపదేశించాడు.

ఈ ఉపదేశంలో కృష్ణుడు జ్ఞానం, కర్మ, భక్తి అనే మూడు మార్గాలను వివరించాడు.

భగవద్గీత అనేది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. ఈ గ్రంథం మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మరియు ఎలా పరమ శాంతిని పొందాలో అన్న దానికి మార్గదర్శనం అందిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Are you human? Please solve:Captcha